ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్టును తీవ్రంగా ఖండింస్తున్నాం..
1 min read
హొళగుంద మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల
ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండల కన్వీనర్ ఎం. షఫీ ఉల్లా ఆగ్రహం
హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్టును నిరసిస్తూ హొళగుంద మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే అరెస్టును తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ హొళగుంద మండల కన్వీనర్ ఎం. షఫీ ఉల్లా మాట్లాడుతూ, ప్రజల తరఫున నిరంతరం పోరాడుతున్న ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని, అలాంటి నాయకుడిని రాజకీయ కక్షసాధింపు ధోరణితో అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.ప్రజల గొంతుకను అణిచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజల పక్షాన నిలిచే నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నించడం సరైన విధానం కాదన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజల మద్దతు తగ్గదని, ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం అవుతుందని స్పష్టం చేశారు.వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తారని, ఎమ్మెల్యే బుసినే విరూపాక్షికి సంపూర్ణ మద్దతుగా ఉంటామని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యేపై నమోదైన కేసులను ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శేషప్ప, బి. ఉమర్, తవాఫ్ ముజామిల్, ఎం. మెకానిక్ రామతుల్లా,అసిఫ్, ఎం. రహమతుల్లా, మారాల మడికి చంద్ర, వన్నూరు క్యాంప్ వీరేష్, మరి స్వామి, చలవాది పంప, మృతుంజయ తదితర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


