NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో (శక్తి సదన్) ను ఆకస్మిక తనిఖీ చేసిన న్యాయమూర్తి”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి  ఈ రోజు అనగా 20-07-2026 న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు గల దిశ ఒన్ స్టాప్ కేంద్రం, మహిళాప్రాంగణం (శక్తి సదన్) ను తనిఖీ చేశారు.  కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించారు. వన్ స్టాఫ్ సెంటర్లో చేరే వారి వివరాలు వారి రికార్డులను సక్రమంగా మెయింటైన్ చేయాలని అలాగే సంబంధిత అధికారుల సంతకాలు కచ్చితంగా తీసుకోవాలని అక్కడ సిబ్బందిని ఆదేశించారు.  బాధితులకు విక్టిమ్ కంపెన్న్సేషన్ త్వరగా అందేలా కృషి చేయాలని అక్కడికి సిబ్బందిని ఆదేశించారు. ఈ సదస్సులో అక్కడ ఉన్న నివాసితులకు లీగల్ సర్వీసెస్ ఆక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయంను పొందుటకు అర్హులని తెలిపారు. వారి భోజన వసతి సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఏవైనా చట్ట పరమైన సమస్యలు వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు కాల్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని  తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబందిత అధికారులు, తదితరులు పాల్గొనారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *