NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రి కి ఆహ్వానం

1 min read

ఉండవల్లి , న్యూస్​ నేడు:  మంగళగిరిలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 5 వరకు జరగనున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ నెల 22న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను ప్రారంభించాలని మంత్రిని కోరారు. ప్రమాణస్వీకారం తర్వాత ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మొదటిసారి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ను ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్ తో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

About Author