NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రీన్ కో  ప్రాజెక్ట్ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలి

1 min read

గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ను సందర్శించిన  జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

ఓర్వకల్లు.న్యూస్ నేడు: నాణ్యత, భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటంతో పాటు పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలని గ్రీన్ కో యాజమాన్యానికి కలెక్టర్ డా. ఏ. సిరి సూచించారు..మంగళవారం గుమ్మితం తాండా వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సందర్శించారు.. గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ సైట్ లోని అప్పర్ రిజర్వాయర్, అప్పర్ ఇన్ టేక్ పాయింట్, ప్రాజెక్ట్ సైట్,పవర్ హౌస్ తదితర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు..ఈ సందర్భంగా  ప్రాజెక్ట్ పనితీరు, రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి, పంపింగ్ ప్రక్రియల గురించి జిల్లా కలెక్టర్ కంపెనీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.1680 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అని, 4000 మెగావాట్ల సౌర మరియు 1000 మెగావాట్ల పవన సామర్థ్యంతో కలిపి మొత్తం 6680 మెగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని  గ్రీన్ కో అధికారులు కలెక్టర్ కి వివరించారు.ఇన్‌టేక్ స్ట్రక్చర్‌లు, 2.35 TMC నీటి అవసరం, రిజర్వాయర్‌ల మధ్య ఎత్తు వ్యత్యాసాలు మరియు జియో-మెంబ్రేన్ ఫేస్డ్ రాక్‌ఫిల్ డ్యామ్‌ల కోసం తవ్విన పదార్థాల పునర్వినియోగం గురించి గ్రీన్కో అధికారులు కలెక్టర్ కు  వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..సమర్థవంతమైన భూ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని,  స్థానిక సమస్యలను ముందుగానే పరిష్కరించాలని సూచించారు..ప్రాజెక్ట్ పనితీరు లోవినూత్నమైన, స్థిరమైన ఇంజనీరింగ్ పద్ధతులను అవలంబించాలని కలెక్టర్ సూచించారు.కార్యక్రమంలో గ్రీన్ కో ప్రాజెక్ట్ పిడి శ్రీనివాసరావు, ఏపీడీ శ్రీనివాస్ నాయుడు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్,  తహసీల్దార్ విద్యా సాగర్, తదితరులు పాల్గొన్నారు.

About Author