NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్యకర్తలు, కన్వీనర్లు, హోదా,పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం

1 min read

18 మంది లబ్ధిదారులకు చెక్కులు

పంపిణీ చేసిన ఆలూరు టిడిపి ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి

8 నెలల్లో ఐదోసారి చెక్కుల పంపిణీ విశేషం

ఆలూరు న్యూస్ నేడు: పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరంగా నిలుస్తోందని ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి పేర్కొన్నారు. సోమవారం ఆలూరులోని ఆమె క్యాంపు కార్యాలయంలో 18 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.తాను ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన 8 నెలల వ్యవధిలో ఇది ఐదోసారి చెక్కులు పంపిణీ చేయడం విశేషమని పేర్కొన్నారు. ప్రజా సేవే తమ లక్ష్యమని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, జిల్లా నాయకులు, వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author