అరుదైన ఘనత సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మనః పూర్వక అభినందనలు
1 min read

న్యూస్ నేడు అమరావతి: పురాతన జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం. తెలుగు వారి అభిమాన కథానాయకుడై సినీ రంగంలో బహుముఖ ప్రతిభతో పవర్ స్టార్ గా ఎదిగారు. రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించారు. సినిమాల్లో ప్రవేశించక ముందే మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతులయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తి. ..నారా లోకేష్,విద్య, ఐటి శాఖల మంత్రి.

