NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హై రిస్క్​ సర్జరీ.. సక్సెస్​…

1 min read

పరిస్థితి విషమించేటప్పుడు ఆస్పత్రిలో చేరిన గర్భిణీ

  • ఆపరేషన్​ విజయవంతం చేసిన అమీలియో వైద్యులు
  • తల్లీ బిడ్డ క్షేమం..
  • అభినందించిన హాస్పిటల్​ ఎం.డి డా. లక్ష్మీ ప్రసాద్​ చాపే

కర్నూలు హాస్పిటల్​,న్యూస్​ నేడు:అధిక రక్తస్రావం.. ప్లేట్​ లెట్​ కణాలు తగ్గిపోవడం.. రక్త పోటు కంట్రోల్​ లేని సమయంలో  ఆస్పత్రిలో చేరిన ఓ గర్భిణీకి  విజయవంతంగా ఆపరేషన్​ చేసి … కుటుంబీకుల మన్ననలు పొందారు అమీలియో ఆస్పత్రి వైద్యులు.  బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి గైనకాలజిస్ట్​ డా. మాబూని , అనస్థియా వైద్యులు డా. విజేత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన గర్భిణీ స్వప్న మూడు రోజుల చికిత్స కోసం కర్నూలు నగరం అమీలియో ఆస్పత్రిలో చేరింది.  అప్పటికే పలు ఆస్పత్రులలో చేర్పించేందుకు ప్రయత్నించినా..ఆయా ఆస్పత్రులు హై రిస్క్​ సర్జని అని … అడ్మిట్​ చేయించుకోలేదని భర్త రాజు తెలిపారు.  ఆపరేషన్​ సమయంలో  గర్భిణీ స్వప్న ప్లేట్​ లెట్​ కణాలు లక్షా 50వేలు ఉండాల్సి ఉండగా  20వేలు మాత్రమే ఉన్నాయి. బీపీ 200/140 తోపాటు అధిక రక్త స్రావంతో బాధపడుతూ ఉంది. వాటన్నిటినీ కంట్రోల్​ చేస్తూ… ఆపరేషన్​ ను పూర్తి చేశామని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని గైనకాలజిస్ట్​ డా. మాబూని వెల్లడించారు.

వైద్యులకు అభినందన

నగరంలోని అమీలియో హాస్పిటల్​ లో హై రిస్క్​ సర్జరీ విజయవంతంగా  పూర్తి చేస్తున్నామని ఆస్పత్రి ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్​ చాపే తెలిపారు.  ఈ నెల 3న  కడుపునొప్పితో బాధ పడుతున్న 12 ఏళ్ల బాలికకు  రిసిక్షన్​ అండ్​ అనాస్టమోసిస్​ ఆపరేషన్​ చేసి.. ఆ బాలికకు కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించామన్నారు. ప్రస్తుతం హై రిస్క్ లో ఉన్న గర్భిణీకి మనోధైర్యమిచ్చి… ఆపరేషన్​ ను సక్సెస్​ చేసిన గైనకాలజిస్ట్​ వైద్యులు డా. మాబూని, అనస్థీయా వైద్యులు డా. విజేతకు  ఈ సందర్భంగా ఆస్పత్రి ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్​ అభినందనలు తెలిపారు.

About Author