హెచ్ఐవి/ఎయిడ్స్ .. సుఖ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు మండలం నందనపల్లె గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలిటరీ కాలనీలో బుధవారం ఉదయం హెచ్ఐవి ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధుల పట్ల అవగాహన సదస్సు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశానికి పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు షమీవుల్లా అధ్యక్షత వహించారు.ఏపీ సాక్స్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దిశా సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఐవి/ఎయిడ్స్ , సుఖ వ్యాధుల పట్ల మరియు డ్రగ్ డి- ఆడిక్షన్ లపై డి ఆర్ పి నాగరాజు మాట్లాడుతూ హెచ్.ఐ.వి వ్యాధి పట్ల యువత కు హెచ్.ఐ.వి పట్ల అవగాహన కలిగి ఉండడం వల్ల హెచ్.ఐ.వి కి గురికాకుండా చూసుకోవచ్చని,చికిత్స కన్నా నివారణ మంచిదని తెలిపారు.హెచ్.ఐ.వి కేవలం అసురక్షిత లైంగిక సంబంధాలు,హెచ్.ఐ.వి ఉన్న గర్భిణీ నుండి పుట్టబోయే బిడ్డకు, హెచ్ఐవితో కలుషితమైన సూదులు సిరంజీలు,పరీక్షింపబడని రక్తము ద్వారా మాత్రమే సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రులలో హెచ్.ఐ.వి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అలాగే పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.అదేవిదంగా,హెచ్.ఐ.వి ఉంది అని నిర్ధారణ అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ ఆర్ టి కేంద్రాల ద్వారా ఉచితంగా ఏ ఆర్ టి మందులు అందుబాటులో ఉన్నాయని, వ్యాధి సోకినవారు మందులు వాడుతూ, వైద్యుల సలహాలు పాటించినట్లయితే ఎటువంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగించవచ్చు అని తెలియచేసారు.హెచ్.ఐ.వి ఉందనే కారణంతో వివక్ష చూపకూడదు అని,అది హెచ్.ఐ.వి./ ఎయిడ్స్ చట్టం – 2017 ప్రకారం శిక్షార్హమైన నేరమని తెలియచేసారు.హెచ్.ఐ.వి పట్ల ఎటువంటి సందేహాలు, అనుమానాలు ఉన్నా జాతీయ హెల్ప్ లైన్ 1097 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలియజేసారు.ఈ కార్యక్రమం ఉమ్మడి కర్నూల్ జిల్లాలోనీ గ్రామాల్లో అవగహన సదస్సులు మరియు సేవలు అందించడం జరుగుతుంది.ముఖ్యముగా యువత, మహిళలు, పొదుపు సంఘాలు, కార్మికులు , గ్రామ ప్రజలను భాగస్వాములు చేయాలని అన్నారు. చివరగా విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు రామ సుబ్బారెడ్డి, సత్య వాణి, శశికళ, నాగలక్ష్మి, శివమ్మ , ఫరా,రుబీన బి లింక్ వర్కర్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

