PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండ‌వ ప్ర‌భాక‌ర‌రావుకు గౌర‌వ డాక్ట‌రేట్‌

1 min read

* ప్ర‌దానం చేసిన కాన్పూర్ యూనివ‌ర్సిటీ

* ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా అంద‌జేత‌

పల్లెవెలుగు వెబ్ కాన్పూరు:  నూజివీడు సీడ్స్ లిమిటెడ్ అధినేత మండ‌వ ప్ర‌భాక‌ర‌రావుకు మరో విశిష్ట గుర్తింపు ల‌భించింది. కాన్పూర్‌లోని చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ యూనివ‌ర్సిటీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ టెక్నాల‌జీ ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌దానం చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్, యూనివ‌ర్సిటీ ఛాన్స్‌ల‌ర్ అయిన ఆనందిబెన్ ప‌టేల్ చేతుల మీదుగా ఆయ‌న ఈ డాక్ట‌రేట్ అందుకున్నారు. వ్య‌వ‌సాయ రంగానికి మండ‌వ ప్ర‌భాక‌ర‌రావు అందించిన విశిష్ట సేవ‌లు, ఆయ‌న నిబ‌ద్ధ‌త‌, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌కు గుర్తింపుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క డాక్ట‌రేట్ అందించారు. మండ‌వ ప్ర‌భాక‌ర‌రావు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ వ్య‌వ‌సాయ కుటుంబంలో జ‌న్మించారు. ఆయ‌న బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ సైన్స్ పూర్వ విద్యార్థి. బీఎస్సీ (అగ్రిక‌ల్చ‌ర్‌)లో యూనివ‌ర్సిటీలో రెండో ర్యాంకు, ఎంఎస్సీ (అగ్రిక‌ల్చ‌ర్‌)లో మొద‌టిర్యాంకు సాధించారు. పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో స్వ‌ర్ణ‌ప‌త‌కం, మెరిట్ స్కాల‌ర్‌షిప్ సాధించారు. 1973లో త‌న తండ్రి స్థాపించిన నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్‌) ప‌గ్గాల‌ను 1982లో చేప‌ట్టారు. అక్క‌డి నుంచి ఎన్ఎస్ఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను దిన‌దినాభివృద్ధి చెందించారు. ప్ర‌స్తుతం ఆ సంస్థ నుంచి విత్త‌నాలు, వ‌స్త్రాలు, మౌలిక స‌దుపాయాలు, పునరుత్పాద‌క విద్యుత్తు లాంటి ప‌లు వ్యాపారాలున్నాయి. ప్రభాకరరావు వివిధ పారిశ్రామిక సంఘాలలో చురుగ్గా పాల్గొంటారు. నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఎఐ) వ్యవస్థాపక సభ్యుడు, అధ్యక్షుడు; ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అధ్యక్షుడు. ఐసీఏఆర్ నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రెడిటేషన్ బోర్డు (ఎన్ఏఈఏబీ) సభ్యుడు. చైర్మన్, ఫిక్కీ – ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్; మొక్కల వంగడాల పరిరక్షణ, రైతు హక్కుల అథారిటీ (పిపివిఎఫ్ఆర్ అథారిటీ), కాటన్ అడ్వైజరీ బోర్డు, జౌళి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం; టెక్స్ టైల్స్ కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్, భారత ప్రభుత్వం; ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వంటి అనేక ప్రభుత్వ సంస్థలలో సభ్యుడు.ప్ర‌భాక‌ర‌రావు అందించిన సేవ‌లకు గాను ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డులు అందాయి. వాటిలో డి.ఎస్.ఐ.ఆర్ 2002 నుంచి బెస్ట్ ఇన్-హౌస్ ఆర్ అండ్ డి నేషనల్ అవార్డు, 2007 లో బెస్ట్ విండ్ ఫామ్ అవార్డు, 2008 నుంచి 2015 వరకు బయో-అగ్రి కంపెనీ, అగ్రికల్చర్ లీడర్‌షిప్ అవార్డు 2009, ఇంటర్నేషనల్ సీఈఓ క్లబ్ అవార్డు 2009, ఏబిఎస్ఏ 2023 నుంచి జీవ‌న సాఫ‌ల్య అవార్డు లాంటివి ఉన్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్) కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రభాకరరావు ఎప్పుడూ ముందుంటారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత కార్యక్రమాలు త‌దిత‌ర‌ రంగాలలో తోడ్పడటం ద్వారా గ్రామీణ భారతదేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మండవ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్టును స్థాపించారు.

About Author