NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్తమ సేవ అవార్డ్ గ్రహీతకు సన్మానం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నారాయణ పేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సబార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్న భీమసేన్ కు 77వ  గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ సేవకు ప్రశంసాపత్రం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ అందచేశారు. ఈ సందర్భంగా వారి మిత్ర బృందం జిల్లా పరిషత్ కార్యాలయంలో శాలువాతో సన్మానం చేసి మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు.కార్యాలయ అధికారులకు,ఉద్యోగులకు,సిబ్బందికి మిఠాయి పంపిణీ చేశారు.భవిష్యత్తులో ఇంకా ఉత్తమమైన సేవలు చేయుటకు భగవంతుడు శక్తి , సామర్థ్యాలు ఇవ్వాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్లు నారాయణ నాయక్, ఎండి. మగ్దూమ్,శ్రీను, అబీబ్, అనిల్,సుజాత మరియు మిత్రబృందం  హెచ్.నర్సింహా,తిరుపతి గౌడ్,శ్రీనివాస్, మురళీ గౌడ్,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

About Author