శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మృత్యుంజయ హోమం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మృత్యుంజయ హోమం జరిగింది అనంతరం మధ్యాహ్నం దాదాపు 1500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది, సాయంత్రం శ్రీవారు సర్వభూపాల వాహనంపై ఊరేగింపు చేయడం జరిగింది, అని అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ టీజీ వెంకటేష్రి శక్తి మని రాజ్య లక్ష్మమ్మ వారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు అధ్యక్షుడు చెరువు వెంకట దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు కంచు గంటల శ్యాంసుందర్ , ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్ , కోశాధికారి సిఎస్ ప్రసాదరావు సలహాదారు టీవీ రవిచంద్ర శర్మ సముద్రాల శ్రీధర్ , హరి శర్మ, మామిళ్ళపల్లి రాజశేఖర్, మురళీకృష్ణ శ్రీనివాసరాజు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

