NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగరపాలక సంస్థ ఇడా పీవో ఎన్.సురేఖకు అవార్డు అందజేసిన జిల్లా కలెక్టర్

1 min read

అభినందించిన తోటి ఉద్యోగులు,అధికారులు, బంధుమిత్రులు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జాతీయ77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లాలో శాఖ పరమైన ఉత్తమ సేవలు అందించిన అధికారులకు స్థానిక పోలీస్ గ్రౌండ్ లో సోమవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా  ఏలూరు జిల్లా అధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు. దానిలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ(ఇడా)లో పిఓ గా పనిచేస్తున్న ఎన్.సురేఖ ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి చేతుల మీదుగా శాఖపరమైన సేవలు అందించడం ద్వారా  జనవరి 26, 2026  గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, జెసి, మరియు ఉన్నత అధికారుల సమక్షంలో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. గతంలో కూడా జిల్లా కలెక్టర్ చేతుల మీదగా అందుకోవడం జరిగింది. మరొక సారి ఉత్తమ అధికారి అవార్డు అందుకోవడం అభినందనీయమని పలువురు  అధికారులు,సహచర ఉద్యోగులు స్నేహితులు,బంధుమిత్రులు ప్రశంసలు అందించారు. ఈ ప్రశంసా పత్రం అందుకోవడం ద్వారా నా బాధ్యతను మరింత పెంచిందని ఆమె అన్నారు.

About Author