ఇళ్ళు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
1 min read

రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు,రేషన్ కార్డులు ఇవ్వాలి
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమంలో నిర్వహించి తహశీల్దార్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించిందని ఆరోపించారు. సూపర్ పథకాల అమలు పేరిట ఆర్భాటం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏ లబ్ధిదారునికి న్యాయం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.చాలా గ్రామాలకు స్మశాన వాటికలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే స్మశాన వాటికలు లేని గ్రామాలకు స్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని, కొత్తగా పెన్షన్లను రేషన్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ, గొర్లి స్వాతి,శాయన అభిలాష్ కుమార్ కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, తమ్మిశెట్టి రమణయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, పుప్పాల కన్నబాబుఉప్పులూరి లక్ష్మి,భవాని,జోజి మేరీ,ఉప్పులూరి రాజమణి, పరిశుద్ధం,నాగం అచ్యుత్,ఎర్ర వెంకటేశ్వరరావు,రమేష్,కె. భాస్కర్,పి శ్రీను,వి.అప్పారావు, కె.నానాజీ, జంతర సీతారత్నం, గాజుల లక్ష్మి, చిలకమ్మ,చంద్రమ్మ, రాజ్యలక్ష్మి, రవణమ్మ,మంగ, ఎల్మాజీ,విజయ దుర్గా,ఎన్ కుసుమ,కె.కుమారి,ఏ పార్వతి, డి.లత, కె.దుర్గ, కె.మని, కె.కల్పన, పావని,బి.గడ్డమ్మ, ఇ.నాగలక్ష్మి,బి సౌమ్య,పులి రమణమ్మ, సముద్రపు సీతమ్మ, మల్లేశ్వరి,కె.కూర్మమ్మ, ఎ.నాగలక్ష్మి, పి.నాగలక్ష్మి, కోటేశ్వరి, పండు,బత్తుల కోటేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

