మార్చి 28న మందకృష్ణ మాదిగ రాక – భారీగా విజయవంతం చేద్దాం
1 min read

: ఎమ్మార్పీఎస్ పిలుపు
హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం, వెల్దుర్తి మండలం, బుక్కపురం గ్రామంలో మార్చి 28వ తేదీన జరుగనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చరిత్రాత్మకంగా మార్చాలని ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ విచ్చేయనుండగా, ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద వాల్ పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల అధ్యక్షులు కెంచప్ప, దేవప్పల ఆధ్వర్యంలో జరిగింది. ఆలూరునియోజకవర్గ కో-ఇన్‌చార్జి మల్లికార్జున అధ్యక్షతన వహించడం జరిగిందిఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగ పాల్గొని మాట్లాడారు.వారు మాట్లాడుతూ — అంబేద్కర్ సేవలు శాశ్వతం – ఆయన మార్గమే మన దారి మందకృష్ణ మాదిగ రాక కర్నూలు జిల్లాకు గౌరవంఅని పేర్కొన్నారు.మార్చి 28న జరిగే ఈ మహా కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామం నుండి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి భారీగా తరలిరండి – కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పకీరప్ప, మండల నాయకులు శేషగిరి, వెంకటేష్, పల్లి ఈరన్న, కల్లప్ప, నగేష్, నాగేంద్ర, వీరేష్, మల్లయ్య, రాజు, దేవేంద్ర, మృత్యుంజయ, మంగన్న, రమేష్, మహేష్, ఉసేని, పతి, గాదిలింగ తదితరులు పాల్గొన్నారు.

