NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులంలో అంతర్జాతీయ మహిళా దినోత్స వేడుకలు

1 min read

ప్రిన్సిపాల్ దాసరి ఝాన్సీ కి అభినందన సత్కారం

విద్యార్థినులు బాల్య దశ నుండే మంచి నడవడిక అలవర్చుకోవాలి

 ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గరికపాటి,హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి దేవరకొండ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: శ్రామిక మహిళా దినోత్సవం సాధించిన దానికి సంతృప్తి పడకుండా సమాజంలో స్త్రీలకు గౌరవం, గుర్తింపు పెరగడానికి దీక్ష పూనడానికి సందర్భంఅని ఎ.వి. ఆర్.విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి దేవరకొండ. వెంకటేశ్వర్లు అన్నారు. వట్లూరులో బి.ఆర్ అంబేద్కర్ గురుకుల సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  సభలో ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం తరపున రెసిడెన్టీయల్ హాస్టల్ ప్రిన్సిపాల్ దాసరి. ఝాన్సీ రాణి కి శాలువా కప్పి,పూల బొకే అందించి మెమొంటో వందించి అభినందన సత్కారం చేశారు. ఈ సందర్భంగా రెసిడెన్టీయల్ హాస్టల్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కి శ్రామిక మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ శ్రామిక మహిళా దినోత్సవం ఎప్పుడు ఎందుకు వచ్చింది వివరించారు. దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పురుషులు స్త్రీలు సమానంగా అభివృద్ధి కోసం చట్టాలు, ప్రజల సంస్కృతిలో మార్పులు రావాలి అన్నారు. ఈ ఆధునిక యుగంలో  స్త్రీలు అన్ని రంగాలలో పురుషులతో పోటీపడి వేగంగా దూసుకుపోతున్నారని, బాల్య దశనుండే మంచి క్రమశిక్షణతో  నడవడికతో విద్యార్థినులు మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు కొమ్మోజు శ్రీనివాసరావు తదితర సిబ్బంది  పాల్గొన్నారు.

About Author