NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానoలో హుండీ లెక్కింపు

1 min read

106 రోజులకు శ్రీ స్వామి వారి హుండీ ఆదాయం రూ:63,26,455/-లు ఆదాయం

సహాయ కమిషనర్,కార్య నిర్వహణధికారిని ఆర్.వి చందన

ఏలూరు జిల్లా,  న్యూస్​ నేడు: జంగారెడ్డిగూడెం మండలము, గురవాయి గూడెం గ్రాములో వేంచేసి యున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము నందు హుండీలను తెరచి లెక్కించుట జరిగినది. సదరు లెక్కింపును  కూచిపూడి శ్రీనివాసు, జిల్లా దేవదాయ శాఖ అధికారి, దేవదాయ ధర్మదాయ శాఖ, ఏలూరు వారి పర్యవేక్షణలో, పోలీస్ మరియు రెవిన్యూ అధికారుల సమక్షములో కే.వీ.బీ .బ్యాంక్ సిబ్బంది సమక్షమున హుండీలను తెరచి లెక్కించగా 106 రోజులకు గాను దేవస్థానము హుండీల ద్వారా రూ.62,34,432/- అన్నదానం హుండీ ద్వారా రూ.92,023/- లు మొత్తం ఆదాయం రూ.63,26,455/- లు దేవస్థానమునకు ఆదాయం సమకూరినది. ఈ హుండీల లెక్కింపులో  అని ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి  ఆర్.వి. చందన తెలియజేసినారు.

About Author