NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుందలో దొంగతనం కేసు ఛేదనం

1 min read

– రూ.5 లక్షల విలువైన బంగారం స్వాధీనం, నిందితుడు అరెస్ట్

హోళగుందన్యూస్ నేడు; హోళగుంద పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 05/2026 కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. u/s 331(1), 305 కింద నమోదు చేసిన ఈ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు.ఈ కేసులో దొంగతనం జరిగిన సొత్తు సుమారు రూ.5 లక్షల విలువ కలిగి ఉండగా, అందులో 2½ తులాల బంగారు నెక్లెస్, ఒక జత చెవి జుంకీలు మరియు ఒక బంగారు చైన్ ఉన్నాయి.ఈ ఘటనకు సంబంధించి ముద్దాయి బోయ సురేష్ (తండ్రి పకీరప్ప), కొత్తపేట, హోళగుంద గ్రామానికి చెందినవాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం ఆలూరు కోర్టులో హాజరు పరిచారు.ఈ సందర్భంగా ఎస్సై దిలీప్ కుమార్ మాట్లాడుతూ, “దొంగతనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నేరాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని” తెలిపారు.ఈ ఆపరేషన్‌లో ఏఎస్ఐ నాగరాజు, కానిస్టేబుళ్లు సుధాకర్, వెంకటేశ్వర్లు, రాజగోపాల్ పాల్గొన్నారు.

About Author