NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనవరి 2  నుండి 9  వరకు  రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

1 min read

గ్రామసభల ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే జనవరి 2 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు నిర్వహించనున్న  రెవెన్యూ గ్రామ సభల్లో  పాత భూ హక్కు పత్రాల స్థానంలో రైతులకు రాజ ముద్ర తో ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఒక ప్రకటన లో తెలిపారు.ఆయా గ్రామాల్లో నిర్దేశించిన రోజున రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించి,  కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారని కలెక్టర్ తెలిపారు.  గతంలో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను వెనక్కు ఇచ్చి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అధికారులు పంపిణీ చేస్తారని కలెక్టర్ తెలిపారు.ఆయా గ్రామాల్లో నిర్వహించనున్న  గ్రామ సభల తేదీల గురించి రెవెన్యూ అధికారులు ముందుగానే తెలియచేస్తారని,  ఆ రోజున రైతులు గ్రామ సభలకు హాజరై కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

About Author