ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలి – ఆపస్
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: 2010 టెట్ నోటిఫికేషన్ కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి ఉత్తీర్ణత నియమం నుండి శాసనంలో మార్పు ద్వారా మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) రాష్ట్ర సంఘటనా కార్యదర్శి సిహెచ్. శ్రావణ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. . శనివారం నాడు నంద్యాల పట్టణం లోని సంఘమిత్ర ఆవాసం లో జిల్లా అధ్యక్షులు యం. యన్ . విజయ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆపస్ అభ్యాస వర్గ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 సంవత్సరంలోనే ప్రకటించాల్సిన పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ఐఆర్ 30% వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర సహ కోశాధికారి ఎ. కృష్ణార్జునరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన ఆర్జిత సెలవులు తదితర బకాయిలు నిర్దిష్ట కాలపరిమితితో వెంటనే చెల్లించాలని, గత సంవత్సరం బదిలీ పొంది రిలీవ్ కాని ఉపాధ్యాయుల స్థానాల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను ఏర్పాటు చేసి వెంటనే వారిని రిలీవ్ చేయాలని కోరారు.రాష్ట్ర కార్యదర్శి జి . మాధవీలత మాట్లాడుతూ ఆపస్ విస్తరణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. సిపిఎస్ నాయకుడు శివారెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించే విధంగా ఆపస్ నాయకులు కృషి చేయాలని కోరారుఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర బాధ్యులు మల్లికార్జున జిల్లా కోశాధికారి శ్రీపతి , వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గత సంవత్సరం సభ్యత్వం కోసం పనిచేసిన కార్యకర్తలను సన్మానించడం జరిగింది.

