NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తెదేపా ఖాతాలో జూపాడుబంగ్లా ఎంపీపీ పీఠం

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ)పీఠం తెలుగుదేశం పార్టీ వశం అయింది.ఎంపీపీ సువర్ణమ్మపై పెట్టినఅవిశ్వాస తీర్మానానికి ఫుల్ స్టాప్ పడింది.ఈ ఎంపీపీ పీఠం కైవసం చేసుకోవాలనిమాండ్ర శివానందరెడ్డి,ఎమ్మెల్యే గిత్త జయసూర్య అనుకున్నది నెరవేరింది.ముందుగా అవిశ్వాస తీర్మాణ సమావేశానికి రావాలని కోరుతూ ఆత్మకూరు ఆర్డీవో డి నాగజ్యోతి ఎంపీటీసీ సభ్యులకు నోటీసులు జారీ చేశారు.జూపాడుబంగ్లా మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం బందోబస్తు మరియు అధికారుల సమక్షంలో ఆర్డీవో ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మండల వైయస్సార్సీపి ఎంపీపీ సువర్ణమ్మపై అవిశ్వాస తీర్మానంలో 9 మంది ఎంపీటీసీలకు గాను 7మంది సభ్యులు హాజరయ్యారు.మిద్దె నీలమ్మ,వెంకటమ్మ,కృపాకర్ గారు,జి సుజాత,రమణమ్మ,కే సుజాత,నాగమణి సమావేశానికి హాజరయ్యారు.అవిశ్వాస తీర్మానానికి గాను ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు చేతులు ఎత్తుతూ మద్దతు తెలిపారు.ఆ తర్వాత మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కూటమి ప్రభుత్వం చేపడుతున్న మండల అభివృద్ధి పనులకు కూడా సహకరించని కారణంగా మండలం ఎంపీటీసీలు అందరూ కలిసి మండల అధ్యక్షులపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి నెగ్గించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీడీవో గోపికృష్ణ,తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్,ఎస్ఐ మల్లికార్జున,కడియం వెంకటేశ్వర్లు యాదవ్,మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,గిరీశ్వర్ రెడ్డి,పిక్కిలి శ్రీనివాసులు, రమణారెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి,పరమేశ్వర్ రెడ్డి, జంగాల పెద్దన్న,శివరామి రెడ్డి,  పాల్గొన్నారు.

About Author