జెడ్పీ ఉన్నత పాఠశాలకు పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఘన విజయం
1 min read
హోళగుందన్యూస్ నేడు: విడుదలైన పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హోళగుంద విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన 110 మంది విద్యార్థులలో 94 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 85 శాతం ఉత్తీర్ణతను సాధించారు.ఇప్పటికే 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ రెగ్యులర్ పరీక్షల్లో 312 మంది విద్యార్థులకు గాను 202 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 65 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. కాగా, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన అనంతరం మొత్తం 312 మంది విద్యార్థులలో 296 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 95 శాతం ఉత్తీర్ణతను సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. కబీర్ సాబ్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చూపిన సహకారం కూడా ఈ అద్భుత ఫలితాలకు కారణమైందని పేర్కొన్నారు.పాఠశాల సాధించిన ఈ అత్యుత్తమ ఫలితాల పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా మరింత మెరుగైన ఫలితాలను సాధించేలా కృషి చేస్తామని పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

