డీఎస్సీ అభ్యర్థుల నియామక పత్రాలు పంపిణీలో భాగస్వాములైన ఎమ్మెల్యే
1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం చేపట్టిన డీఎస్సీ అభ్యర్థుల నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టి స్వల్ప కాలంలోనే నియామక పత్రాలు ఇచ్చిన ఘనత తమ కూటమి ప్రభుత్వంకు దక్కుతుందన్నారు.అన్న మాట నిలబెట్టుకొని నిరుద్యోగ యువతను ఆదుకున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ లకే దక్కుతుందని అభివర్ణించారు. నేటితరం విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేల మీ ఉద్యోగాలను సాకారం చేసుకోవాలన్నారు.

