NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

1 min read

ప్రతి సెంటర్లో విద్యార్థులకు  మౌలిక వసతులు కల్పించాలి

ఆర్ పి ఎస్ ఎఫ్ నాయకులు డిమాండ్

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా లో ఇంటర్ పరీక్షలు ను సజావు గా నిర్వహించే విధంగా జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్ పి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని ముఖ్యంగా తరగతి గదులలో బెంచులు ఫ్యాన్లు లైట్లు తాగడానికి త్రాగునీరు, వాష్ రూమ్స్ తదితర  వసతులను కల్పించాలని వారు అన్నారు. కొన్ని సమస్యమాత్మకంగా  సెంటర్లలో సమగ్రంగా తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించాలని, సరైన అర్హత గల ఇన్వెజిరేటర్లు ఏర్పాటు చేయాలని ప్రతి తరగతి గదిలోను సీసీ కెమెరాలు ను ఏర్పాటు చేయాలని వారన్నారు. ఇప్పటికి కూడా కొన్ని సెంటర్లో సరైన మౌలిక వసతులు లేవని అలాంటి వాటిపై ఆర్ ఐ ఓ గారి దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఆర్ పి ఎస్ ఎఫ్ కర్నూల్ టౌన్ ప్రెసిడెంట్ ప్రశాంత్, సెక్రటరీ దివాకర్ నాయకులు బబ్లు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

About Author