NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజయవంతంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం 

1 min read

పత్తికొండ, న్యూస్ నేడు:  పత్తికొండ నియోజకవర్గం లో అన్ని పాఠశాలల్లోనూ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం విజయవంతంగా నిర్వహించారు.జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పుచ్చకాయలమడ ఎంపీపీ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం నులి పురుగుల గుళికలను వేశారు. నులిపురుగుల గుళికలను తప్పనిసరిగా విద్యార్థులకు వేయించాలని సైనింగ్ ఉపాధ్యాయిని కళ్యాణి కుమారి విద్యార్థులు తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలలు నులిపురుగుల మందుల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం పాఠశాలలో ఉపాధ్యాయ బృందం విజయవంతంగా నిర్వహించింది. విద్యార్థుల్లో నులిపురుగుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై చైతన్యం పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని సైనింగ్ టీచర్ కళ్యాణ్ కుమార్ చెప్పారు.కార్యక్రమానికి హెచ్‌.ఎం లోకనాథ్ , కుర్షీద్ బేగం , షైనింగ్ టీచర్ కళ్యాణి కుమారి , అలీ బాషా , మల్లికార్జున, సూపర్వైజర్ ఉమా మహేశ్వరి , ఏఎన్‌ఎం లావణ్య దేవి మరియు ఆశా వర్కర్లు పాల్గొని విద్యార్థులకు నులిపురుగులు ఎలా వ్యాపిస్తాయి, వాటి లక్షణాలు ఏమిటి, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలపై పూర్తిస్థాయిలో వివరించారు.చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన నీరు త్రాగడం, శౌచాలయాలను ఉపయోగించడం, ఎప్పుడూ చెప్పులు ధరించడం వంటి మంచి అలవాట్ల ప్రాముఖ్యతను వారు వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంవిద్యార్థులకు. నులి పురుగుల నివారణ మాత్రలు అందజేశారు.

About Author