NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కన్నుల పండుగగా బుగ్గ రామేశ్వరుని రథోత్సవం

1 min read

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చరితా రెడ్డి

భారీగా పోలీసు బందోబస్త్..

ఓర్వకల్లు, న్యూస్​ నేడు: కనీ వినీ ఎరుగని రీతిలో బుగ్గ రామేశ్వరుని రథోత్సవం కన్నుల పండుగగా ఘనంగా జరిగింది.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ శ్రీ బుగ్గ రామేశ్వరుని రథోత్సవ కార్యక్రమం రథోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం ఆలయ ప్రధానార్చకులు శ్రీ కళ్ళే లక్మీ నారాయణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ముందుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మరియు టిటిడి పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.ఎమ్మెల్యే ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని భక్తులు ఇరువైపులా తాడుతో పట్టుకొని  కర్నూలు-నంద్యాల జాతీయ రహదారి వైపుకు వెళ్లి తిరిగి వెనక్కి యథా స్థానానికి రథోత్సవాన్ని తీసుకువచ్చారు.

సంఘటనలు తలెత్తకుండా భారీగా పోలీసు బందోబస్త్

రథోత్సవ కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సీఐ లు, ఓర్వకల్లు ఎస్సై సునీల్ కుమార్,ఉలిందకొండ ఎస్సై ధనుంజయ మరియు పోలీసులు భారీగా విధులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈ మద్దిలేటి,ఆలయ చైర్మన్ కే నారాయణ,తహసీల్దార్ విద్యాసాగర్,మండల కన్వీనర్ నాగిరెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ పాలకొలను సుధాకర్ రెడ్డి మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author