ఏలూరు ఆదిత్య డిగ్రీ కళాశాల లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
1 min read

మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందితే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి
కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించినట్లు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కె.రమ (రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,స్త్రీవిముక్తి సంఘటన) మరియు ఎల్.భాను (రాష్ట్ర కోశాధికారి, పి.డి.యస్.ఒ), టి.చిన్ని (జిల్లా నాయకులు స్త్రీవిముక్తి సంఘటన) పాల్గొన్నారని తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా 1908లో న్యూయార్క్ నగరంలో 15వేల మంది మహిళలు, పురుషులతో సమాన వేతనం హక్కులు, విధులు కల్పించాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించారని, అనంతరం 1911లో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారని తెలిపారు. 1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా మహిళా దిన్సోవాన్ని ప్రకటించినట్లు తెలిపారు. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుకుంటూ అగ్రగాములుగా నిలిచేందుకు పట్టుదలతో కృషి చేయాలని అన్నారు.అనంతరం ముఖ్య అతిధిగా కె. రమ (రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్త్రీవిముక్తి సంఘటన) వారు మాట్లాడుతూ మహిళలందరూ వారి వారి రంగాలలో విధాన నిర్ణయాలలో చాలా సమర్థవంతమైన పాత్ర పోషిస్తూ నేటి మహిళా శక్తికి ఆదర్శపాయంగా నిలుస్తున్నారని, మహిళా దినోత్సవం జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం స్త్రీ సాధికారకంగా తన కలలను సాకారం చేసుకొనేలా ప్రోత్సాహ వాతావరణాన్ని కల్పించడం మన భాద్యతని అన్నారు.కళాశాలల నందు పనిచేయుచున్న మహిళా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని మరియు జీవితంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని సాహెూసోపేతంగా జీవనాన్ని సాగిస్తున్న వారిని, ఆదర్శముర్తులుగా ఎంచి వారిని ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమములో వైస్ ప్రిన్సిపాల్ శ్రీ డి.వి.వి. ఫణికుమార్, కల్చరర్ ఆఫీసర్ పి. సౌభాగ్యలక్ష్మిదేవి, ఎస్.ఎస్.ఎస్. ప్రోగామ్ ఆఫీసర్ కె. హరిబాబు మరియు మహిళా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని విద్యార్థునులు పాల్గొన్నారు.


