చలో ఢిల్లీ విజయవంతం చెయ్యండి..ఏపిటీఎఫ్
1 min read

హోళగుంద న్యూస్ నేడు: విద్యా హక్కు చట్టం అమలైన 01/04/2010 తేదీ కంటే ముందే నియామకం పొందిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ ఉత్తీర్ణులు కావాలని చెప్పడం సహేతుకంగా లేదని ,కొన్ని సంవత్సరాలుగా ఒక సబ్జెక్టులో బోధన చేస్తున్న ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టుల సిలబస్ తో రూపొందించిన టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి చేయడం అశాస్త్రీయమైన నిర్ణయమని చట్ట సవరణ చేసి విద్యాహక్కు చట్టం 2009 అమలుకు ముందే నియామకం పొందిన ఉపాధ్యాయులకు ఈ నిబంధనను తొలగించాలని ఏపిటీఎఫ్ జిల్లా కార్యదర్శి ముత్తన్న డిమాండు చేశారు.టెట్ నిబంధనను తొలగించాలని ఏపిటీఎఫ్ ఆధ్వర్యం లో ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర ఈ నెల 10 న చేస్తున్న ధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల మూసివేత దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయని పేద బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా ప్రపంచ బ్యాంకు షరతులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నాయని మేధావులు,విద్యావేత్తలు తల్లిదండ్రులు ,విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఏపిటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపునందుకొని రాష్ట్రం లోని నలుమూలలనుండి ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణకు తరలి రావాలని కోరారు.

