దెందులూరులో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు
1 min read
మహిళలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
కొవ్వలి గ్రామంలో అంగనవాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ,చిన్నారులకు కేక్ అందజేత
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతిమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు దెందులూరు నియోజకవర్గంలో శనివారం ఘనంగా జరిగాయి. దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో స్థానిక కూటమి నాయకులు, మహిళల ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలను అత్యంత ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు చింతమనేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని ఎంతోమంది స్థానిక మహిళలు, అక్కాచెల్లెమ్మలతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి కి ఆయన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి అర్ధాంగిగా అన్ని విధాలా చేదోడు వాదోడుగా నిలుస్తూ,యువ నాయకులు మంత్రి నారా లోకేష్ కి మాతృమూర్తిగా ఒక యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దినా మాతృమూర్తిగా వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.భగవంతుని ఆశీస్సులతో శ్రీమతి భువనేశ్వరి నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వారు చేస్తున్న సామాజిక సేవలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అనంతరం వేడుకల్లో పాల్గొన్న స్థానిక మహిళలు, వృద్ధులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా తన కేక్ తినిపిస్తూ ఆత్మీయతను చాటుకున్నారు. పండగ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు నాగానబోయిన సత్యనారాయణ,పోతులూరు సొసైటీ చైర్మన్ బొడ్డేటి మోహన్, కూటమి నాయకులు బాయి రాంప్రసాద్ సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలుతోపాటు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కొవ్వలి గ్రామంలో స్థానిక అంగనవాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్ అకస్మాక తనిఖీ చేశారు. అంగనవాడి పిల్లలకు అందిస్తున్న నాణ్యమైన భోజన సదుపాయాన్ని పాఠశాల టీచర్లను,అంగన్వాడి ఆయాలను అడిగి తెలుసుకున్నారు. అంగనవాడి చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించడమే లక్ష్యమని తెలియజేశారు. చిన్నారులకు కేక్ కట్ చేసి స్వయంగా వారికి తినిపించారు.

