NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ తీసివేయడం అన్యాయం…

1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు మండల కేంద్రంలో ఆర్​అండ్​ బి గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశంలో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మాట్లాడుతూ..నారా చంద్రబాబు నాయుడు  ఎన్నికల సమయంలో ప్రతి  బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ  వాళ్లకు 50 సంవత్సరలు నిండిన ప్రతి ఒక్కరు పెన్షన్ ఇస్తానని చెప్పి ఇప్పటివరకు పెన్షన్ గురించి మాట్లాడడం లేదు.. రాష్ట్రంలో అనవసరంగా వికలాంగులకు 40 శాతం ఉన్న వాళ్లందరికీ  పెన్షన్ కట్ చేస్తున్నామని నోటీసులు ఇస్తున్నారు. నిజంగా అర్హులైన  వికలాంగులకు పెన్షన్ తీసివేయడం ఈ కూటమి ప్రభుత్వానికి ఆ ఘనత దక్కుతుందన్నారు. ఎక్కడ 6000 ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి  ఇప్పుడు ఉన్న ఫలంగా అర్హులైన వికలాంగులకు పెన్షన్ తీసివేయడం చానా విడ్డూరమన్నారు. ప్రజలందరూ కూడా మీరు చేసే అన్యాయాలను అక్రమాలను చూస్తూ ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతున్న కొత్త పెన్షన్ను  దరఖాస్తు చేసుకోవడానికి వదలడం లేదన్నారు. నేను కూడా స్వయంగా ఎంపీడీఓ లతో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని  చెప్పడం జరిగింది. పెన్షన్ నోటీసు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను మాట ఇస్తున్నానని  మీరందరూ కలిసి వస్తే  ఆలూరు నడిబొడ్డున వికలాంగులతో పాటు నేను కూడా ధర్నాలో కూర్చుని మీకు పెన్షన్ ఇచ్చేంతవరకు అక్కడే కూర్చుని ధర్నా చేస్తానని చెప్పడం జరిగింది..తూతూ మంత్రంగా  ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని  అనవసరమైన లెక్కలు చెప్తున్నారు. మీరు ఎన్నికల్లో  దొంగ హామీలు చెప్పినందుకే  అధికారంలో కూర్చున్నారు, ఇప్పుడు చూస్తే వికలాంగుల పెన్షన్ తీస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి, లేనిపక్షంలో  నేను ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని కూటమి ప్రభుత్వాని హెచ్చరించారు..ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే   బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.

About Author