రాజ్యసభ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో టిడిపి రాజ్యసభ్యుల నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ఐటీడీపీ రాష్ట్ర చీఫ్ చింతకాయల విజయ్ నామినేషన్ దాఖలు చేస్తున్న కార్యక్రమంలో ఐటిడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చింతకాయల విజయ్ ని కలిసి ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపి నామినేషన్ కార్యక్రమంలో ఆయనతోపాటు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు , టీడీపీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడిగా రాజకీయ వారసత్వంతో పాటు సొంత ప్రతిభతో కలిగిన గొప్ప నాయకుడు విజయ్ ని, 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీకి నిరంతరం అండగా ఉంటూ కష్టపడి పని చేశారని , వైసిపి నిరంకుశ పాలనలో ఎందరో కార్యకర్తలకు ధైర్యాన్ని నింపుతూ, అక్రమ కేసులను ఎదురు నిలబడి పోరాడుతూ వారికి అండగా నిలిచారని, పార్టీ గెలుపు బాటలో పయనించడానికి తన వంతు కృషి చేయడం లో కీలక పాత్ర విజయ్ పోషించారు అని అన్నారుఐటీడీపీ ఆర్గనైజేషన్ ద్వారా ద్వారా ఐటీడీపీ సభ్యులను డిజిటల్ గా కనెక్ట్ చేసి సభ్యత్వ నమోదులో సరికొత్త రికార్డు సృష్టించిన ఘనత విజయ్ ది అని, ఈరోజు తమ రాష్ట్ర అధ్యక్షుడైన చింతకాయల విజయ్ కి ఢిల్లీ వేదికగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు రాష్ట్ర ప్రయోజనాలను సమర్ధవంతంగా వినిపిస్తూ రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలు అందించడానికి చంద్రబాబు రాజ్యసభ సభ్యునిగా స్థానం కల్పించడం చాలా సంతోషకరమైన విషయమని గట్టు తిలక్ హర్షం వ్యక్తం చేశారు.


