విద్యార్థులకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి..
1 min read

27 వరకు విద్యార్థుల ఆధార్ శిబిరం..
మిడుతూరు, న్యూస్ నేడు: శనివారం నుండి 27వ తేదీ వరకు ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆధార్ శిబిరాన్ని వినియోగించుకోవాలని మిడుతూరు ఎంపీడీఓ పి దశరథ రామయ్య,ఎంఈఓ ఫైజున్నిసా బేగం శుక్రవారం అన్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఆధార్ అప్డేట్ లేని విద్యార్థుల కొరకు ఆధార్ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. అదేవిధంగా మండలంలో 3 వేల మంది విద్యార్థులకు ఆధార్ అప్డేట్ లేవని వీరందరూ తప్పనిసరిగా విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకువచ్చి ఆధార్ అప్డేట్ చేయించాలని ఎంఈఓ-2 మల్లికార్జున నాయక్ అన్నారు.మండలంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులకు బయోమెట్రిక్ అప్డేట్ లేనివారి పేర్లు పాఠశాలల్లో ఉన్నాయని వాటిని చూసుకొని విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పూర్తిచేసే విధంగా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సాయి తిమ్మయ్య పాల్గొన్నారు.

