NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం సహాయ నిధి పేదలకు వరం

1 min read

ఏడో విడత సియం సహయ నిధి చెక్కులు పంపిణీ

మంత్రాలయం తెదేపా ఇంచార్జీ  రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం న్యూస్ నేడు :  నిరుపేదల కోపం తలపెట్టిన సియం సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం అని మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మాధవరం లోని టిడిపి కార్యాలయంలో ఏడో విడతలో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రాలయం మండలం టిడిపి అధ్యక్షులు ఎస్ యం గోపాల్ రెడ్డి, కౌతాళం టీడీపీ మండలాధ్యుక్షులు సురేష్ నాయుడు తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఏడు విడతలో పంపిణీ చెయ్యడం జరిగినదని తెలిపారు. ఏడో విడతలో రూ.8,36,310  రూపాయల మంజూరు కావడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి చెక్కులను అందిస్తున్నామని ప్రతి ఒక్కరు దీని సద్వినియోగం చేసుకోవాలన్నారు., ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు నియోజకవర్గ ప్రజలకు , లబ్ధిదారులు  ప ధన్యవాదాలు తెలియజేశారు. ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి ని టిడిపి నాయకులను లబ్ధిదారులు పూలమాలలు వేసి శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author