రక్తదానం చేసిన జనసేన యువకుడు..
1 min read

మిడుతూరు , న్యూస్ నేడు: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి అర్థం అందించి మంచి మనసుతో స్పందించి రక్తదానం చేశాడు జనసేన యువకుడు..ఎమ్మిగనూరుకు చెందిన కురువప్ప అనే వ్యక్తి ఎమ్మిగనూరు దగ్గర 19వ తేదీన తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరో వాహనం ఢీ కొనడంతో ప్రమాదంలో కాలు విరిగింది.తర్వాత కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.ప్రమాద సమయంలో రక్తం ఎక్కువగా పోవడంతో రక్తం కావాలని డాక్టర్లు చెప్పారు.కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వాట్స్అప్ గ్రూపులో చేరవేయడంతో విషయాన్ని తెలుసుకున్న నంద్యాల జిల్లా మిడుతూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ ఎస్ ప్రభాకర్ సోమవారం ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు.మరో యువకుడు రాజేష్ రక్తదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కుటుంబ సభ్యులు ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వినోద్ పాల్గొన్నారు.

