NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భ్రమరాంభ గెస్ట్ హౌస్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్

1 min read

శ్రీశైలం/నంద్యాల, న్యూస్​ నేడు: భారత ప్రధానమంత్రి ఈనెల 16న శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పర్యటనకు రానున్న నేపథ్యంలో, జాయింట్ కలెక్టర్ శ్రీ సి. విష్ణు చరణ్ ఆదివారం భ్రమరాంభ గెస్ట్ హౌస్‌ను సందర్శించి అక్కడి ఏర్పాట్లు, వసతులను సమీక్షించారు. పర్యటన సందర్భంగా ఆయన గెస్ట్ హౌస్‌లో ఉన్న వసతి సదుపాయాలు, గదుల శుభ్రత, ఆహార వసతులు, మరియు నిర్వాహణ విధానాలను పరిశీలించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది డ్యూటీలు వంటి అంశాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి  శ్రీశైలం పర్యటన సందర్భంగా గెస్ట్ హౌస్‌లో వసతులను మెరుగుపరచడం అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తున్నామన్నారు. సౌకర్యవంతమైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం, మరియు సమర్థవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గెస్ట్ హౌస్‌లో ఉన్న సదుపాయాలను ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా  మరమ్మతులు, అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేయాలని సూచించారు. విశిష్ట అతిథులకు సౌకర్యవంతంగా ఉండేలా విద్యుత్, నీటి సరఫరా, భద్రతా పర్యవేక్షణ వ్యవస్థలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, దేవస్థాన అధికారులు జేసీ వెంట ఉన్నారు.

About Author