NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెంచికలపాడు విశ్వ భారతి హాస్పిటల్ న్ని తనిఖీ చేసిన న్యాయమూర్తి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  గౌరవ జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి  సోమవారం  నాడు పెంచికలపాడు నందుగల విశ్వభారతి జనరల్ ఆసుపత్రిలోని మానసిక వికలాంగుల విభాగాన్ని తనిఖీ చేయడం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో మానసిక వికలాంగుల సంక్షేమం కొరకు, వారికి న్యాయ సహాయం అందించడం కోసం ఎల్ సమ్​ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అనంతరం వార్డు నందు గల మానసిక వికలాంగులను కలిసి వారితో మాట్లాడారు న్యాయపరమైన హక్కుల గురించి వారికి తెలియజేశారు. అనంతరం లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ మనోన్యాయ్ సభ్యులు మరియు వారి యొక్క సంబంధిత ఫోన్ నంబర్లు గల బోర్డు ను ఆవిష్కరించారు. మానసిక వికలాంగుల కు ఎవరికైనా న్యాయ సహాయం కావాలంటే  బోర్డు నందు గల మెంబెర్స్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే వారికి కావలసిన న్యాయ సహాయం అందిస్తారని  తెలిపారు. వికలాంగుల ఆరోగ్య మరియు సంరక్షణ గురించి అలాగే వారికి అందుతున్న ఆహార, వైద్య సదుపాయాల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో విశ్వ భారతి హాస్పిటల్ డాక్టర్ మహేంద్ర కుమార్, డాక్టర్ శివ శంకర్ రెడ్డి సైక్రియాటిస్ట్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author