‘ ఎమర్జెన్సీ ’లో ప్రాథమిక చికిత్స కే ప్రాధాన్యం
1 min read
బ్రెయిన్ అండ్ స్పైయిన్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ అండ్ క్రిటికల్ కేర్ డా. వి. మురళీ కృష్ణ
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు:ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటలో ఇచ్చే ప్రాథమిక చికిత్సే ప్రాణం నిలబెడుతుందని, ఆ సమయంలో బాధిత వ్యక్తికి సహాయం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు బ్రెయిన్ అండ్ స్పైయిన్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ అండ్ క్రిటికల్ కేర్ డా. వి. మురళీ కృష్ణ. ఆదివారం కర్నూలు నగరం ఏ క్యాంపులోని హార్ట్ ఫౌండేషన్ ఛాంబరులో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, డా. ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ నేతృత్వంలో ‘ ఎమర్జెన్సీ సమయంలో సాధారణ చికిత్స ’పై మెడికల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రెయిన్ అండ్ స్పైయిన్ హాస్పిటల్ క్రిటికల్ కేర్ వైద్యులు డా. మురళీ కృష్ణ మాట్లాడారు. రోడ్డు ప్రమాదం జరిగినా… పాము కాటు వేసినా… ఇంటిలో ప్రమాదవ శాత్తు గ్యాస్ పేలినా , విషం తాగినా, తదితర సమయల్లో ఇచ్చే అత్యవసర చికిత్స అతి ముఖ్యమైనదన్నారు. ప్రస్తుత సమాజంలో యువత అతివేగంగా వాహనాలు నడుపుతూ.. ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ విద్యార్థులు, ప్రజలు, యువత … ఎవరైనా ఎమర్జెన్సీ లో ప్రాథమిక చికిత్స ఇవ్వడంపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా బ్రెయిన్ అండ్ స్పైయిన్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ అండ్ క్రిటికల్ కేర్ డా. వి. మురళీ కృష్ణ స్పష్టం చేశారు.
డా. మురళీ కృష్ణ కు ఘన సన్మానం
కర్నూలు హార్ట్ ఫౌండేషన్ లో మెడికల్ విద్యార్థులకు ‘ ఎమర్జెన్సీసమయంలో ప్రాథమిక చికిత్స ’ పై అవగాహన కల్పించిన బ్రెయిన్ అండ్ స్పైయిన్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ అండ్ క్రిటికల్ కేర్ డా. వి. మురళీ కృష్ణ ను ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు చంద్ర శేఖర్ కల్కూర, ప్రధాన కార్యదర్శి డా. చంద్ర శేఖర్ ఘనంగా సన్మానించారు. అనంతరం డా. ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిష్ట్రార్ గా బాధ్యతలు స్వీకరించిన డా. సాయి సుధీర్ ను కూడా ఘనంగా సత్కరించారు.



