బీజేపీ అభ్యర్థిపై 2,034 ఓట్ల మెజారిటీతో కె. శ్రీనివాసులు ఘన విజయం
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలం జక్కసానికుంట్ల ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కె. శ్రీనివాసులు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి బోయ ప్రమీలపై 2,034 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.విజయం అనంతరం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ విజయంతో జక్కసానికుంట్ల గ్రామంలో ఉత్సాహం నెలకొంది. పలువురు నాయకులు, కార్యకర్తలు కె. శ్రీనివాసులుకు అభినందనలు తెలిపారు. తన విజయానికి సహకరించి, మద్దతుగా నిలిచిన ఓటర్లందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


