NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధికి నోచుకోని కడుమూరు పాఠశాల..

1 min read

పీడీఎస్ యు జిల్లా కార్యదర్శి మర్రిస్వామి..

మిడుతూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(ఉర్దూ)అభివృద్ధికి నోచుకోవడం లేదనిప్రగతిశీలా ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి పి.మర్రిస్వామి అన్నారు.మర్రిస్వామి మాట్లాడుతూ పాఠశాలలో సమస్యలు తాండ విస్తున్నాయన్నారు.పాఠశాలకు వెళ్లాలంటే మురికి కాల్వ నిల్వ ఉండడం వల్ల విద్యార్థులు దుర్వాసన రావడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురౌతున్నారని ఈ దుర్వాసన వస్తూ ఉన్నాబాలికలు విద్య నభ్యసిస్తున్నారని విద్యార్థులకు రోగాలు వచ్చే అవకాశం ఉందని అదేవిధంగాఅదనపు తరగతి గదుల నిర్మాణం ఆగడంతో విద్యార్థులు వరండాలో కూర్చొని చదివే పరిస్థితి నెలకొందన్నారు.మరుగుదొడ్లు లేకపోవడంతో  ఉపాధ్యాయులు,బాలికలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.టీచర్ల కొరత ఉందని 10 తరగతులకు గాను నాలుగు గదులే ఉన్నాయని అన్నారు.విద్యార్థులకు కనీసం ఆడుకోవడానికి స్థలం లేదన్నారు.క్షేత్రస్థాయిలో ఎక్కడ చూసినా సమస్యలు తాండవిస్తున్నాయని మరి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యు డివిజన్ సహాయ కార్యదర్శులు ఆసిఫ్,సాయి పాల్గొన్నారు.

About Author