అయ్యప్ప స్వామి వారికీ అభిషేకం … ప్రత్యేక పూజలు
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఊరేగింపు సందర్బంగా శ్రీ రాచుటయ్య స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి వారికీ అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది… ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గురుస్వామి మరియుసోదరుడు బుసినే శ్రీరాములు స్వామి ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివ స్వాములు,భక్తులు పాల్గొన్నారు.అదేవిధంగా ఈరోజు సాయంత్రం 3:00 గంటలకు శ్రీ అయ్యప్ప స్వామి ఊరేగింపు జరుగును కావున ఈ ఊరేగింపు మహోత్సవ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు,భవాని స్వాములు, శివ స్వాములు, ఆంజనేయ స్వాములు, భక్తులు పాల్గొనాలని కోరారు.


