NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి..

1 min read

ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే “స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలి

ప్రతి ఒక్కరూ మనస్సు పెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి

జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో “వ్యక్తిగత & సమాజ పరిశుభ్రత” కార్యక్రమంలో పాల్గొని,గోదావరి వనంలో  పూల మొక్కను  జిల్లా కలెక్టరేటులో జిల్లా కలెక్టరు మొక్కలు నాటారు. ప్రాంగణంలో  మూడవ శనివారం నిర్వహించే  “స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా “వ్యక్తిగత & సమాజ పరిశుభ్రత” అనే థీమ్ తో జిల్లా కలెక్టరేటు ఉద్యోగులు, విద్యార్థిని, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, గోదావరి వనంలో   పూల మొక్కను  జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల వ్యాధులకు దూరం కావచ్చన్నారు.  పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని, పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి రోజులలో మొక్కలను నాటి  వాటిని పరిరక్షించడం ఒక అభిరుచిగా చేసుకోవాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు  ప్రతి నెల మూడవ శనివారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రభుత్వ యేతర సంస్థలలో  స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా పాటించడం  జరుగుచున్నదని అన్నారు.సామూహిక మరుగుదొడ్ల అవగాహన, నిర్వహణ కోసం స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద, సేవా సంస్థలను భాగస్వామ్యులను చెయ్యాలని అన్నారు. పట్టణ, గ్రామీణ మంచినీటి సరఫరా పరిశుభ్రతపై తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, కర్రీపాయింట్లు, ఫుడ్ తోపుడు బండ్లు, తదితర విక్రయ శాలలు వద్ద పరిశుభ్రత శీతాకాలం సీజన్లో అంటూ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులపై ప్రత్యేక దృష్టి సారించాలని  ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, పరిపాలన అధికారి నాంచారయ్య, సెట్ వేల్ సిఇవో కె.యస్.ప్రభాకర రావు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, ఉద్యోగులు, జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బి.బెన్నీ, సభ్యులు యం.చంద్రశేఖర రావు,రెడ్ క్రాస్ కమిటీ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ  సభ్యులు,ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

About Author