NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

13 న శ్రీ శనైశ్వర స్వామి దేవాలయంలో శని త్రయోదశి వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:   ప్రచురణార్థం13.6.26 శనివారము శని త్రయోదశి కార్యక్రమం పురస్కరించుకొని కర్నూలు నగరము నందు పవిత్ర తుంగభద్రా నది తీరాన గీతా ప్రచార ధామం నందు వెలసిన శ్రీ శనైశ్వర స్వామి దేవాలయములో శని త్రయోదశి వేడుకలు అత్యంత వైభవముగా జరుగుతాయి ఉ.6.00 పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది పూజకు కావలసిన పూజా సామాగ్రి అంతయు దేవస్థానము నందు లభించును కనుక భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారికి తైలాభిషేకం చేసే అవకాశం కల్పించారు .అలాగే మన దేవస్థానం నందు మొట్టమొదటిసారిగా (పావుగడ శని సింగనాపూర్) మాదిరిగా సా.6.30 పల్లకి సేవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రతి భక్తునికి భక్తురాలికి పల్లకి మోసే అవకాశం కల్పించారు కనుక భగవద్ బంధువులందరూ వచ్చి స్వామివారి కార్యక్రమములో పాల్గొని అనంతరం తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా మనవి అని దేవస్థాన ప్రధాన కార్యదర్శి మహాబలేష్ సజ్జనార్ ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియపరచడమైనది.    పురుషులందరూ పంచ,వస్త్రం ధరించుకొని రావలెను  .

About Author