రాఘవేంద్రుని సన్నిధి లో కర్నాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్
1 min read

పీఠాధిపతులతో కలిసి శ్రీ మఠం అభివృద్ధి పనులు పరిశీలన
ఫిలిగ్రీం అమేనీటి సెంటర్ కు భూమి పూజ
మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కర్నాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సతీ సమేతంగా బుధవారం వచ్చారు. వీరికి శ్రీమఠం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి కి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్శితలు ఇచ్చి మొమొంటో ఆశీర్వదించారు. శ్రీ మఠం అభివృద్ధి పనులు పరిశీలన : – కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సతీమణి తో కలిసి పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు శ్రీమఠం అభివృద్ధి పనులు పరిశీలించారు. గో సంరక్షణ సందర్శించి గో పూజ చేశారు. శ్రీ మూల రామ నిలయం నూతనంగా నిర్మిస్తున్న ఫిలిగ్రీం అమేనీటి సెంటర్ కు టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, టిడిపి మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ స్వామి తో కలిసి భూమి పూజ చేశారు. ఆయన రాక సందర్భంగా ఆంధ్ర, కర్నాటక పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన వెంట కర్నాటక మంత్రులు క్రీడలశాఖ మంత్రి అశోక్, సోషల్ వేల్ఫర్ శాఖ మంత్రి బోసరాజు, ఎమ్మెల్యేలు, తెలంగాణ మంత్రి వచ్చారు.


