NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో మ‌హిళ అవ‌య‌వ‌దానం

1 min read

ప‌దిహేనేళ్ల క్రిత‌మే భ‌ర్త మ‌ర‌ణం

అప్పట్నుంచి ఆరుగురు పిల్లల్ని పెంచిన భాగ్యమ్మ‌

ఫిట్స్, మెద‌డులో ర‌క్తస్రావంతో బ్రెయిన్ డెడ్‌

జీవ‌న్‌దాన్ స‌మ‌న్వయంతో అవ‌య‌వ‌దానానికి ముందుకొచ్చిన పిల్లలు

కర్నూలు పోలీసుల గ్రీన్ ఛాన‌ల్‌తో సాఫీగా గ‌మ్యాల‌కు అవ‌య‌వాలు

క‌ర్నూలు,  న్యూస్​ నేడు: భ‌ర్త ఎప్పుడో 15 ఏళ్ల క్రిత‌మే మ‌ర‌ణించినా.. త‌న రెక్కల క‌ష్టంతో ఆమె ఆరుగురు పిల్లల‌ను పెంచి పెద్దచేశారు. అలాంటి త‌ల్లికి ఫిట్స్ కార‌ణంగా బ్రెయిన్ డెడ్ అయ్యింది. త‌మ త‌ల్లి మ‌రో న‌లుగురి రూపంలో జీవించి ఉండాల‌ని ఆ పిల్లలు భావించారు. దాంతో అవ‌య‌వ‌దానానికి ముందుకొచ్చారు. గుండెలు క‌దిలించే ఈ ఘ‌ట‌న క‌ర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో జ‌రిగింది. నంద్యాల జిల్లా శ్రీ‌శైలంలోని కొత్తపేట‌కు చెందిన భాగ్యమ్మ (50)కి భ‌ర్త సామేలు ప‌దిహేనేళ్ల క్రిత‌మే మ‌ర‌ణించారు. అప్పటినుంచి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడిని ఆమే పెంచి ప్రయోజ‌కుల‌ను చేశారు. అక్కడి వైద్యులు పూర్తిగా ప్రయత్నించినప్పటికీ, ప‌రిస్థితి విష‌మిస్తుండ‌డంతో మెరుగైన వైద్యం కోసం క‌ర్నూలు కిమ్స్ ఆస్పత్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె 21న బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లు కిమ్స్ వైద్యులు ప్రక‌టించారు. ఇందుకోసం కర్నూలు పోలీసులు గ్రీన్ ఛాన‌ల్ ఏర్పాటుచేయ‌డంతో ఎలాంటి ఆల‌స్యం లేకుండా అవ‌య‌వాలు త‌క్కువ స‌మ‌యంలోనే నెల్లూరు, హైద‌రాబాద్ చేరుకున్నాయి. క‌ష్టకాలంలో కూడా అవ‌య‌వ‌దానం చేసేందుకు ముందుకొచ్చిన భాగ్యమ్మ పిల్లల‌ను జీవనదాన్ బృందం, కిమ్స్ ఆస్పత్రి వైద్యబృందం, యాజ‌మాన్యం అభినందించారు మరియు అశ్రునయనాలతో ఘనంగా పుష్పాంజలి ఘటించి వీడ్కోలు పలికారు.

About Author