మూడేళ్ల బాలుడి ప్రాణాలు రక్షించిన కిమ్స్ సవీర వైద్యులు
1 min read
తొలుత న్యుమోనియాతో చీము పట్టి ఇన్ఫెక్షన్
వాట్స్ ప్రొసీజర్‌తో చీము తొలగించిన వైద్యులు
పూర్తిగా కోలుకున్న బాలుడు
అనంతపురం, న్యూస్ నేడు : మూడేళ్ల బాలుడికి న్యుమోనియాతో పాటు పలు రకాల సమస్యలు వచ్చి ప్రాణాపాయం సంభవించింది. ఒకటి తర్వాత ఒకటిగా పలు రకాల చికిత్సలు చేసి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించిన అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు అతడికి ప్రాణదానం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి వైద్యులు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్. ఏ. మహేష్ డాక్టర్ సి. మనోహర్ గాంధీ, డాక్టర్. మౌనిక, డాక్టర్ పి. గిరిధర్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరిప్రసాద్, సిటిసర్జన్ డా. సందీప్ రెడ్డి, అనస్థీషీయాలజిస్ట్ డా. రవిశంకర్ లు ఈ కేసు వివరాలు వెల్లడించారు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి చిన్న పిల్లలకు ఎటువంటి సమస్యలు వచ్చిన సమర్థవంతగా ఎదుర్కొనడానికి అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన ఎన్ఐసియు, పిఐసియు సేవలు కిమ్స్ సవీర హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ సీఈఓ శ్రీనివాస్ ప్రసాద్, ఎంఎస్, డా. హబీబ్ రాజా, సీఓఓ సిద్దారెడ్డి తెలిపారు.

