సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
1 min read
పత్తికొండ , న్యూస్ నేడు: పత్తికొండ నియోజకవర్గం నియోజకవర్గంలోని పత్తికొండ, మద్దికేర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలకు చెందిన బాధితులకు ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పత్తికొండలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 38 మంది లబ్దిదారులకు 29 లక్షల 30 వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న వారు ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ , ముఖ్యమంత్రి చంద్రబాబుకు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదవాళ్లు అనారోగ్యానికి గురైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని వారికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

