ల్యాక్రోస్ చాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభం..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు లో మొదటి సౌత్ జోన్ సీనియర్ నేషనల్ ల్యాక్రోస్ చాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ఆదర్శ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈపోటీలను కర్నూలు కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్. శంకర్ శర్మ, సౌత్ జోన్ రీజియన్ హోం గాడ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈపోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ ల్యాక్రోస్ క్రీడ ఎంతో ప్రాచీనమైనదని 11వ శతాబ్దంలో అమెరికా దేశస్తులు ల్యాక్రోస్ క్రీడను ఆడేవారన్నారు.ల్యాక్రోస్ క్రీడ భారతదేశం లో నూతనంగా వచ్చిందని దీనిలో క్రీడాకారులు రాణించాలని సూచించారు. 2028 సంవత్సరం లో జరిగే ఒలింపిక్స్ గేమ్స్ లో ల్యాక్రోస్ క్రీడను ఎంపిక చేశారన్నారు. ల్యాక్రోస్ ఒలింపిక్స్ గేమ్స్ లో భారతీయ క్రీడాకారులు పథకాలు సాధించాలని డాక్టర్. శంకర్ శర్మ కోరారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అందువల్ల 25 సంవత్సరాల నుంచి విద్యార్థులు క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సాహం ఇస్తున్నానని తెలిపారు. ఈకార్యక్రమంలో డిఎస్పీ మహాబూబ్ బాష, రామకృష్ణ రెడ్డి, డాక్టర్. చంద్రశేఖర్ రెడ్డి, అనీ ప్రతాప్, శివారెడ్డి క్రీడా ప్రతినిధులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

