నేషనల్ హైవేపై భారీ స్థాయిలో కంటైనర్లలో గోవుల అక్రమ రవాణా
1 min read

ఏలూరు జిల్లాలో అడ్డుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు, దెందులూరు కూటమి నాయకులు
ఆవులు గోశాలకు తరలింపు
ఏలూరు, న్యూస్ నేడు: అరకు నుంచి చిలకలూరి పేటకు భారీ కంటైనర్ల లో గోవులను అక్రమంగా తరలిస్తున్న వైనం బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గూడ్స్ రవాణా పేరుతో రహస్యంగా గోవుల తరలింపు చేస్తున్న లైవ్ స్టాక్ క్యారియర్ నిర్వాహకులను బిజెపి, దెందులూరు కూటమి నాయకులు అడ్డుకున్నారు. పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద వాహన సెస్సు వివరాలను దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది పరిశీలించారు.3కంటైనర్ లలో భారీగా తరలిస్తున్న దాదాపు 75 జీవాల గుర్తించి గోశాలకు తరలించారు. ఏఎంసీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన నిర్వాహకులను పెద్ద ఎత్తున నాయకులు అడ్డుకున్నారు.సమాచారం అందుకుని ఘటన ప్రాంతానికి చేరుకున్న దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారపాటి రామసీత, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ సహా వివిధ శాఖల అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.తమ వాహనాల్ని అడ్డుకుంటే తొక్కించుకుంటూ వెళ్ళిపోతామంటూ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడటంతో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. దెందులూరు ఏఎంసి చైర్మన్, బిజెపి నాయకులు రంగంలోకి దిగటంతో నిర్వాహకులు పరారయ్యారు.AP 39W 4035, AP 39WE 8528 సహా పలు కంటెయినర్ల లో అక్రమంగా మూగజీవాలను కబేళాలు కి తరలిస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు.గోవులను కాపాడి స్థానిక గోసంరక్షణ శాలకు తరలించడానికి కొంత ఇబ్బందులకు గురయ్యారు.ఈసందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణాపై సహించం.రాక్షసంగా, క్రూరంగా గోవులను తరలిస్తున్నారు..దీని వెనుక ఉన్న వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.దెందులూరు, ఏలూరు పార్లమెంట్ నాయకులు కృష్ణప్రసాద్ సహా పలువురు నాయకుల ఆధ్వర్యంలో లారీ నిలుపుదల చేయటం జరిగింది. ప్రతిసారి ఇలా పట్టుకోవటం గోశాలకు అందిస్తున్నాం, కానీ గో శాలల్లో నామ మాత్రపు చర్యలు వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.ఇకపై అలా జరగకుండా ప్రభుత్వం మరిన్ని కటిన చర్యలు చేపట్టాలని.ఇలాంటి ఘటనలు జరగకుండా ముక్తా కంఠంతో ఖండిస్తున్నమన్నరు. ఇకపై ఇలాంటివి జరిగితే చూస్తూ ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించారు.ఇటువంటి ఘటనల్లో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేసి పశిష్టమైన చర్యలతో అరికట్టేల సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ని కోరుతున్నాట్లు తెలిపారు.దెందులూరు వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత మాట్లాడుతూ “అనధికారికంగా గోవులను తరలిస్తున్నారనే సమాచారం రావడంతో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను నిలుపుదల చేయగా, దానికి సంబంధించిన నిర్వాహకులు తాము గత వైసిపి ప్రభుత్వం హయాం నుంచి కూడా యదేచ్చగా గోవుల అక్రమ రవాణా ఇలాగే కొనసాగిస్తూ ఉన్నామని ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారిందని ఈ విధంగా అడ్డుకుంటే ఊరుకోబోమని చెప్పి, అక్రమ రవాణా చేస్తున్న నిర్వాహకులు మార్కెట్ కమిటీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం జరిగిందని దీంతో సమాచారం అందుకొని తాను మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు కిషోర్ సహా కూటమి నాయకులు చేరుకుని గోవుల అక్రమ రవాణాన్ని అడ్డుకోవడం జరిగిందని వైసీపీ హయాంలో జరిగినట్లు అక్రమాలు కూటమి ప్రభుత్వంలో కొనసాగనివ్వమని తెలిపారు.


