NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళిత జాతికి చెందిన ఏడిజిపి వై. పురాణకుమార్ చిత్రపటానికి శ్రద్ధాంజలి

1 min read

చిత్రపటానికి నివాళులు అర్పించిన దళిత సేన నాయకులు

 ఆత్మహత్యకు ప్రేరేపించిన ఉన్నతాధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి  డిమాండ్

 దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జవరపు రవి ప్రకాష్ డిమాండ్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు  : మధ్యాహ్నం దళిత జాతి ముద్దుబిడ్డ ఏడిజిపి వై. పురాణ కుమార్ ఐపీఎస్ చిత్రపటానికి దళిత సేన నాయకులు నివాళులర్పించారు. గురువారం  దళిత సేన రాష్ట్ర కార్యాలయం ఏలూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo దళిత జాతి కి చెందిన హర్యానా రాష్ట్ర ఏడీజీపీ వై.పురాణ కుమార్ ఐపీఎస్  హర్యాన రాష్ట్ర బిజెపి, పోలీస్ఉన్నతాధికారుల వేధింపులకు మరియు కుల వివక్షత కారణంగా ఆత్మహత్య కు పాల్పడిన కారణంగా ఈ ఘటన యావత్ భారతదేశం  మరువలేదన్నారు.     వై. పురాణ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన చిత్రపటానికి దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ మరియు ఏలూరు జిల్లా దళిత సేన ఇంచార్జ్ పింగుల ఇదియా, కృష్ణాజిల్లా దళిత సేన ఇంచార్జి బుసే అనిల్ కుమార్, లింగపాలెం మండల ప్రధాన కార్యదర్శి లక్క పాము దాసు మొదలగు దళిత సేనకార్యకర్తలు ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా రవి ప్రకాష్ మాట్లాడుతూ దళిత జాతికి చెందిన వై పురాణ కుమార్ పై కులవవక్షత వేధింపులకు పాల్పడి ఆత్మహత్యకు కారుకులైన హర్యానా రాష్ట్ర డిజిపి మరియు మరొక ఎస్ పి స్థాయి అధికారి పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ సరిపించాలని హర్యానా రాష్ట్రంలో పోలీసు శాఖలో ఉన్న కులవివక్షత,వేధింపులను నిరోధించాలని అందుకు జాతీయ ఎస్సీ కమిషన్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఈసందర్భంగాభారతదేశానికి రాజ్యాంగం ఏర్పడి సుమారు 75 సంవత్సరాలు కావస్తున్న భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లోఉన్న కులవివక్షత పాతుకుపోయి ఉన్నదని, ఈ కుల వివక్షత పూర్తిగానిర్మూలించబడేదాకా దళిత సేన ఉద్యమం చేస్తుందని పేర్కొన్నారు. కుల వివక్షత నిర్మూలనకు ప్రతి ఒక్కరు కలిసి రావాలని రవి ప్రకాష్ విజ్ఞప్తి చేస్తూ పిలుపునిచ్చారు.

About Author