NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లింపిక్ డే ఉత్సవాలను జయప్రదం చేద్దాం

1 min read

కర్నూల్ స్పోర్ట్స్ న్యూస్​ నేడు: ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న ఒలింపిక్ డే ఉత్సవాలను జయప్రదం చేద్దామని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి. శంకర్ శర్మ పిలుపునిచ్చారు.శనివారం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో గత 20 సంవత్సరాలుగా నిర్విరామంగా రాష్ట్రంలో ఎక్కడిలేని విధంగా సంబరాలను నిర్వహించటం అది జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కి చెందుతుందని ఆయన కితాబిచ్చారు. క్రీడారంగంలో నిర్వాహకులు శక్తులుగా మారాలని ఆయన సూచించారు. అలాంటి సందర్భంలోనే రాటు తేలిన క్రీడాకారులను మల్చవచ్చు అన్నారు. ఏపీ ఎస్పీ డిఎస్పిఎస్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఈ సంబరాల్లో పోలీసు రెవెన్యూ ,జర్నలిస్టు, అడ్వకేట్స్ కు పోటీలను నిర్వహించటం వారిని మిలితం చేయటం క్రీడారంగం బలోపేతం అవుతుందని ఆయన సూచించారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులు రామాంజనేయులు సురేంద్ర  మాట్లాడుతూ పోటీల విజయవంతానికి సహకరిస్తున్న క్రీడాశంగా ప్రతినిధులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు, క్రీడాకారులకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిది రోజులపాటు వీలైనంత క్రీడాంశాల్లో అంతర్ పాఠశాలల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్రీడా సంఘ ప్రతినిధులు హర్షవర్ధన్, షేక్షావలి, జాఫర్ మున్నా, విజయ్ కుమార్, చిన్న శంకన్నా సురేంద్ర, పరశురాముడు చంద్రయ్య శేషన్న, గంగాధర్, శ్రీనివాసులు, సువర్ణ ప్రణీత్, ఇంద్ర, మురళి, ఫరూక్, రాఘవేంద్ర, సుందర్, ప్రభాకర్, రాము, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

About Author