విజయదశమి కనుక ఆడపిల్లలకు లక్కీ డ్రా లో 50, వేలు
1 min read

అమ్మాయి భవిష్యత్తు సురక్షితం కోసం
సంఘ సేవా కార్యకర్త. గుగ్గిళ్ళ చాణిక్య
చెన్నూరు,న్యూస్ నేడు: మండల కేంద్రమైన చెన్నూరు పరమట వీధిలో వెలసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా సంఘ సేవ కార్యకర్త. గుగ్గిళ్ళ చాణిక్య. అమ్మాయి భవిష్యత్తు సురక్షితంగా ఉంటే సమాజం సురక్షితంగా ఉంటుంది. అనే నినాదంతో ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా ఆడపిల్లలకు లక్కీ డ్రా లో 50 వేల రూపాయలు అందివనన్నారు. విజయదశమి పురస్కరించుకొని9-8-2024 నుండి 8-8-2025 సంవత్సరం మధ్య పుట్టిన ఆడపిల్లలకు 50వేల రూపాయలు లక్కీ డ్రా శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి కమిటీ నిర్వాహకులచే ఏర్పాటు చేశారు. ఇందుకోసం పాప యొక్క డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆధార్ కార్డు. ఫోన్ నెంబర్. అడ్రస్ పూర్తి వివరాలతో అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో కమిటీ నిర్వాహకులకు అందజేయాలని కోరారు. విజయదశమి రోజున2-10-2025 దేవస్థానం నందు లక్కీ డ్రా ఇస్తారు. ఈ లక్కీ డ్రా లో గెలుపొందిన ఆడబిడ్డకు 50 వేల రూపాయలు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి దేవస్థానం ద్వారా బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేయబడుతుందని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కమిటీ కోరారు. సేవా సంఘ సేవా కర్త. గుగ్గిళ్ళ చాణిక్య. మాట్లాడుతూ గత సంవత్సరం 2024-9న కలకత్తాలో ఆర్ జి కర్ మెడికల్ కళాశాల నందు జరిగిన ఒక దుర్ఘటన నాకెంతో బాధ కలిగించిందని తెలిపారు. ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకొని అమ్మాయి భవిష్యత్తు సురచితంగా ఉండేందుకు 50వేల రూపాయలు బ్యాంకు నందు ఫిక్స్ డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు.

